హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యక్ష యుద్ధామే: వైయస్ జగన్ వ్యతిరేకుల ప్రతిదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఆయన వ్యతిరేకులు ప్రతి దాడికి దిగారు. కాంగ్రెసు రెండుగా చీలి ప్రత్యక్ష యుద్ధానికి మోహరించాయి. జగన్‌ వర్గం శాసనసభ్యులు అధిష్ఠానం మాటను లెక్క చేయకుండా ఓదార్పు యాత్రకు సన్నద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు, జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ సమావేశమై తాము యాత్రలో పాల్గొంటామని ప్రకటించారు. సోమవారం తుని వద్ద జిల్లాలో ప్రవేశించే యాత్రకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం తదితర మాజీ శాసనసభ్యులు కూడా జగన్‌ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ సహా జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఏదో ఒక దశలో యాత్రలో పాల్గొంటారని జగన్‌వర్గం భరోసాతో ఉన్నారు. జిల్లాలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యాత్రకు వెళ్లకుండా అధిష్ఠానం తరఫున నిలువరించే పనిలో మంత్రి బొత్స సత్యనారాయణ నిమగ్నమయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నెల 16వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశం సందర్భంగా తన రాజీనామాను సమర్పిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇంతటి తీవ్ర వాతావరణంలోనూ రోశయ్య,జగన్‌ల మధ్య సయోధ్యకు కొందరు మంత్రులు ప్రయత్నాలు సాగించారు. ఇందుకోసం ఢిల్లీలో పెద్దలతో కూడా మాట్లాడాలని నిర్ణయించారు. రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. వైయస్ జగన్ వ్యాఖ్యలను మోపిదేవి వెంకట రమణ, అహ్మదుల్లా, శిల్పా మోహన్‌రెడ్డి, బాలరాజు ఖండించారు. మంత్రులు తన యాత్రకు రాలేక, అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యను వారు ఖండించారు. ఆదివారం సీనియర్‌ నేతలు, పార్టీ బాధ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా జగన్‌పై విమర్శలకు దిగారు. జగన్‌ పార్టీని, ప్రభుత్వాన్ని అనవసరమైన వివాదాల్లోకి లాగి ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవరిస్తున్నారని మంత్రులు మండిపడగా, ఆయన కార్యకర్తల ముందు తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై నిందలు మోపడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో జగన్‌ ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ వెంట ఉంటారని భావించిన వైయస్ అనుచరులు కూడా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంత వరకు వైయస్ పై అభిమానంతో దూరంగా ఊంటూ కూడా జగన్ యాత్రకు సహకరించామని, అయితే జగన్ వ్యవహారం శ్రుతి మించడం వల్ల తాము దూరం కావాల్సి వస్తోందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X