హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెగించిన వైయస్ జగన్: సిఎం రోశయ్యపై డైరెక్ట్ అటాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెగించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. నాలగవ రోజు శ్రీకాకుళం ఓదార్పు యాత్రలో ఆదివారం రాత్రి వరకు ఏ విధమైన విమర్శలు లేకుండా సాగింది. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఆయన ఆదివారం అర్థరాత్రి ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తనను చూసి రోశయ్య ఎందుకు భయపడుతున్నారని ఆయన అడిగారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు రోశయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నేనెప్పుడైనా ముఖ్యమంత్రి పదవిని కోరానా అని ఆయన అడిగారు. "నేను ఓదార్చడానికి వస్తే...సీఎం పదవి ఎగిరిపోతుందన్న భయమా? ఈ అధ్వాన రాజకీయాలు చూసి సిగ్గుతో తలవంచుకోవాలి. నాకు మీ అందరితోడు..నాన్న ఆశీస్సులు ఉన్నాయి. నాకు అదే చాలు! శ్రీకాకుళం జిల్లాలో మీరు ఆదరణ.. ఆప్యాయత చూపించారు. గుండెల్లో పెట్టుకొని వెళుతున్నాను" ఆయన అన్నారు.

"శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నా జీవితంలో మరచిపోలేని సంఘటనలు...నాకర్థం కాని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ ఉన్నా వారి మనసులు నా మీదే ఉన్నాయి. నా కుడి పక్కన ఎంపీగారి భర్త, ఎడమ పక్కన ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నారు. నేను ఓదార్పు కోసం వచ్చాను. బాధ నుంచి నేను కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ప్రజానీకం బాధపడ్డారు. వారిని లాలించి పరామర్శించడానికి నేను అన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక ఎమ్మెల్యే వస్తే ఎంతో బాగుండును అని అనుకున్నాను. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడంలేదు" అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X