రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లా యాత్రలో తగ్గిన వైయస్ జగన్ వేడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: శ్రీకాకుళంలో జరిగిన ఓదార్పు యాత్రతో పోల్చుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర కాస్తా చప్పబడింది. జగన్ మాటల తూటాలు విసరలేదు. ఎక్కడా ఎక్కువగా మాట్లాడలేదు. తన స్వరాన్ని తగ్గించుకున్నారు. తీరు మార్చుకున్నారు. ఇది వ్యూహంలో భాగమా అనే ఆలోచనకు తావు కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో తొలి రోజు యాత్రలోనే సందడి తగ్గింది. నిర్వాహకులు ఎంచుకున్న పర్యటన మార్గం, సమయం కూడా యాత్రను నిరాసక్తంగా మార్చాయని అంటున్నారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు తుని వద్ద డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు రాజా అశోక్‌బాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాపాక వరప్రసాద్‌, ఎన్‌.శేషారెడ్డి, పొన్నాడ సతీష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తదితరులు జగన్‌ కు స్వాగతం పలికారు. భారీ వర్షం కారణంగా యాత్ర ఆలస్యంగా 11 గంటలకు ప్రారంభమైంది.

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా అశోక్‌ బాబుతో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బి.శివప్రసాద్‌ రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలకృష్ణ సోమవారం యాత్రలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జగన్‌ కు స్వాగతం పలికిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా యాత్రలో ఆ జిల్లాకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా పాల్గొనని నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు స్వాగతం పలకడం, వారిలో సగంమంది జగన్‌ వెన్నంటి నడవడం పట్ల ఆయన సన్నిహితులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రామ్మోహనరావు, మారెప్ప, తోట గోపాలకృష్ణ, వరుపుల రాజా తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X