MI Vs SRH: రోహిత్ రీ ఎంట్రీ పై బిగ్ ట్విస్ట్- స్లార్ ప్లేయర్ కు పిలుపు,ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే..!!

IPL 2026: ఈ సారి ఐపీఎల్ లో ముంబాయిని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబాయి ఇండియన్స్ కు ఇక ప్రతీ మ్యాచ్ కీలకం. గత సీజన్లలో తొలి ఆఫ్ లో నిరాశ పరిచి సెకండ్ ఆఫ్ లో వరుస విజయాలు సాధించిన ఘనత ఈ టీం కు ఉంది. అయితే, ఈ సారి మంత్రి పరిస్థితులు అనుకూలంగా కనిపించటం లేదు. ఈ రోజు సన్ రైజర్స్ తో హార్దిక్ టీం తల పడనుంది. అటు సన్ రైజర్స్ మంచి రైజింగ్ లో ఉన్నారు. కాగా.. ఈ మ్యాచ్ కు ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ దూరం కాగా.. రోహిత్ శర్మ పైన బిగ్ ట్విస్ట్ తెర పైకి వచ్చింది. దీంతో... ఇప్పుడు తుది జట్టు పై అంచనాలు మారుతున్నాయి.

ముంబాయి ఇండియన్స్ ను ఒక వైపు వరుస ఓటములు, మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రోహిత్ శర్మ జట్టులోకి రీ ఎంట్రీ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచులకు దూరమైన హిట్ మ్యాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే కీలక పోరులోనైనా ఆడతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. తన 39వ పుట్టినరోజు వేళ రోహిత్ మైదానంలో కనిపిస్తాడని ఆశించిన అభిమానులకు ముంబై మేనేజ్మెంట్ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఐపీఎల్ 2026 మధ్యలో రోహిత్ శర్మ హాంస్ట్రింగ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.ఈ రోజు (బుధవారం) సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఆడటంపై నిర్ణయం టాస్ వేసే సమయంలోనే తీసుకుంటామని ముంబాయి ఇండియన్స్ మేనేజ్మెంట్ పేర్కొనడం అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది.

rohit-sharma-likely-to-miss-todays-ipl-2026-match-against-srh-despite-recovering-from-injury-here

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ కీలకం

రోహిత్ లేకపోవడంతో ముంబై ఓపెనింగ్ జోడీ అస్తవ్యస్తంగా మారింది. హిట్ మ్యాన్ స్థానంలో వచ్చిన డానిష్ మాలేవార్ పరుగులను సాధించడంలో విఫలమవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ముంబాయి జట్టు లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తన ఎడమ భుజం బెణకడంతో అతను ఇక ఆడలేడని వైద్యులు తేల్చారు. సాంట్నర్ స్థానంలో సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. సాంట్నర్ లాంటి ఆల్‌రౌండర్ లేకపోవడం ముంబై బౌలింగ్ విభాగంలో పెద్ద లోటుగా కనిపిస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఇక మీదట ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. చిన్న పొరపాటు జరిగినా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టు ఇక ఈ టోర్నీ పైన పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+