తెలంగాణ పది ఫలితాలు విడుదల, తొలిసారిగా.. ఇలా చెక్ చేసుకోండి..!!
తెలంగాణ పది ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవ రావు ఫలితాలను విడుదల చేసారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 1వ తేదీ రవకు పరీక్షలు జరిగాయి. తొలిసారిగా వాట్సప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్షలు పూర్తయిన తరువాత వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి సమస్యలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తరువాత ఈ రోజు ఫలితాలను ప్రకటించారు.
ఈ ఏడాది తెలంగాణ పరీక్షల్లో 95.15 శాతం విద్యార్ధులు పాసయ్యారు. గత ఏడాది 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి పెరిగింది. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కు లను వెల్లడించారు. ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు రికార్డులు లిఖించాయి. 5,731 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. ఆరు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. 4,97, 312 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ లో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో పది పరీక్షలకు 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 25వ తేదీతో మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. మార్కుల క్రోడీకరణ పూర్తి చేయటంతో.. అనుకున్న దానికంటే ముందుగానే ప్రకటించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
తొలి సారిగా వాట్సప్ లో పరీక్షా ఫలితాలు
కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది. ఇక, ఫలితాల వెల్లడి పైన ఈ ఏడాది తెలంగాణ SSC బోర్డు విద్యార్ధుల కోసం కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించటంతో.. ఫలితాలను సైతం అదే విధంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. దీని ద్వారా విద్యార్ధులకు సలభంగా మార్కులు తెలుసుకొనే అవకాశం కల్పించారు.













Click it and Unblock the Notifications