బాలయ్య-కొరటాల మూవీ స్టోరీ లీక్... బాక్సాఫీస్ బద్దలే
నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ డ్రామా పట్టాలెక్కబోతోంది. సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో మేళవించి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన కొరటాల, బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో రాబోతోంది. 'దేవర' వంటి భారీ విజయం తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దీనిపై భారీ అంచనాలున్నాయి.
సరికొత్తగా బాలయ్య రూపం
ఈ సినిమా కోసం బాలకృష్ణ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరోల క్యారెక్టరైజేషన్, గెటప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కొరటాల శివ, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక భిన్నమైన పవర్‌ఫుల్ లుక్ ను డిజైన్ చేశారు. క్లాస్, మాస్ ప్రేక్షకులను సమానంగా అలరించేలా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని, బాలయ్య ఒక శక్తివంతమైన మాఫియా డాన్ తరహా పాత్రలో కనిపిస్తారని సమాచారం.

ఈ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా కథలో అంతర్లీనంగా జోడించారు. ఇప్పటికే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి మాఫియా డాన్ పాత్ర.
ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కొరటాల శివ మార్క్ మెసేజ్, బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీ తోడవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మే నెలలో వచ్చే అనౌన్స్‌మెంట్ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని, బాక్సాఫీస్ బద్దలే అని నందమూరి అభిమానలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 2027 సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications