బెంగాల్ ఫలితాల పై మోదీ లెక్క ఇదే, తమిళనాడు పైనా తేల్చేసారు..!!
పశ్చిమ బెంగాల్ లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడత తరహాలోనే రెండో విడత లోనూ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు వరకు 61.11 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు. సాయంత్రానికి 90 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బెంగాల్ లో పెరిగిన పోలింగ్ తమకే అనుకూలమని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇటు మమతా సైతం గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితా ల పైన ఆసక్తి కర లెక్కలు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో గెలుపు పైన రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో పోరాటం సాగిస్తు న్నాయి. రెండో విడతలోనూ పోలింగ్ భారీగా నమోదు అవుతోంది. బీజేపీ పైన మమతా సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. అటు బీజేపీ నాయకత్వం తమదే విజయమని ధీమాగా ఉంది. మమతా అండ్ టీం తామే బెంగాల్ లో అధికారం తిరిగి దక్కించుకోబోతున్నామని చెబుతోంది. ఈ సమయం లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ హ్యాట్రిక్ ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, అసోం, బంగాల్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి ఎన్నికల్లో విజయం తమదేనని పేర్కొన్నారు. బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. బెంగాల్ లో ప్రచారం చివరి సభ లోనూ మోదీ తాను తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేసారు. బెంగాల్ లో 15 ఏళ్ల మమతా పాలనకు ప్రభుత్వం ముగింపు పలికారని చెప్పుకొచ్చారు.

బెంగాల్ ఫలితం పైన పెరుగుతున్న ఉత్కంఠ
ఇక, తమిళనాడులో బీజేపీ అన్నా డీఎంకేతో జత కట్టింది. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసింది. తమిళ నాడులోనూ భారీగా పోలింగ్ జరిగింది. అక్కడ విజయ్ ఫ్యాక్టర్ కీలకంగా మారింది. విజయ్ పార్టీకి భారీగా ఓట్లు పోలయినట్లు అంచనాలు కనిపిస్తున్నాయి. కాగా.. మోదీ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకే ఆధిక్యత దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. బెంగాల్ లో రెండో విడతలోనూ పెరిగిన పోలింగ్ శాతం పైనే బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని టీఎంసీ నేతలు అంగీకరిస్తున్నారు. అయితే, విజయం మాత్రం తమదేనని చెబుతున్నారు. కాగా.. బెంగాల్ కీలక జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మే 4న బంగాల్‌తోపాటు అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం రానున్న ఎగ్జిట్ పోల్స్ పైనా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications