ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోంపేట ఘటనపై చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: సోంపేట ఘటనపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ను స్థానికులు అడ్డుకోవడానికి ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనను చిరంజీవి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో మత్స్యకారులే సమిధలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సెజ్ లకు గానీ ఇతర ప్రాజెక్టులకు గానీ భూసేకరణ జరిపే విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వం నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించి భూసేకరణ జరిగేలా చూడాలని ఆయన అన్నారు. సోంపేట ఘటనను సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా ఖండించారు. సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, కళా వెంకట్రావు సోంపేట ఘటనను ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+