వైయస్ జగన్ పై మావోయిస్టుల గురి : ఓదార్పు యాత్రలో మార్పులు

పోలీసు శాఖ సూచన మేరకు ఏజెన్సీలో తలపెట్టిన ఓదార్పు యాత్రను జగన్ పూర్తిగా రద్దు చేసుకోగా, 14, 15, 16 తేదీల యాత్రలో స్వల్ప మార్పులు కూడా చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని బాధితులను జగన్ వారి ఇళ్ల వద్ద ఓదారుస్తారు. జగన్ ఓదార్పు యాత్రను నక్సలైట్లు చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఓ వ్యక్తి క్రమం తప్పకుండా జగన్ యాత్రకు వస్తుండడాన్ని వారు పసిగట్టి ఇప్పటికే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications