కాంగ్రెసులో సరిరారు జగన్ కెవరు: అంబటి రాంబాబు

Ambati Rambabu
గుంటూరు: కాంగ్రెసులో జగన్ ఎవరూ సాటి రారని సస్పెన్షన్ కు గురైన కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ విషయం తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో రుజవు అవుతోందని ఆయన అన్నారు. ఇరవై రోజులుగా యాత్ర జరుగుతున్నప్పటికీ ప్రజాదరణ ఇప్పటికీ తగ్గలేదని ఆయన అన్నారు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని కొంత మంది తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, దాని వల్ల జగన్ మరింతగా పెరుగుతారని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జగన్ ముఖ్యమంత్రి కావాలని మెజారిటీ శాసనసభ్యులు కూడా సంతకాలు చేశారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు రాష్ట్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు సరైన నాయకత్వం లేని విషయాన్ని తెలియజేస్తాయని ఆయన అన్నారు. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను అడ్డుకోకపోతే కాంగ్రెసు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని ఆయన అన్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకులు కూడా జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. జగన్ ఆ ప్రాంతంలో పర్యటించి ఉంటే ముఖ్యమంత్రి కె. రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయడానికి అవకాశం కలిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాన నాయకులు కూడా ప్రచారానికి వెళ్లకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. జగన్ కు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రోశయ్య, డి. శ్రీనివాస్ పెద్ద నాయకులే అయినప్పటికీ వారిని వైయస్ రాజశేఖర రెడ్డితో పోల్చలేమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+