రోశయ్యకు వయస్సుతో పాటు హుందాతనం పెరగలేదు: బాబు

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ సమస్యపై జాతీయ స్థాయిలో అందరి మద్దతు కోరేందుకు తాము ఢిల్లీ వెళ్లామని ఆయన అన్నారు. ఢిల్లీలో బర్దన్, ప్రకాష్ కారత్, దేవెగౌడ, తంబిదురై తదితరులను కలిసినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల గురించి చెప్పి మద్దతు సంపాదించామని ఆయన అన్నారు. అఖిల పక్షం వస్తుందని తెలిసి కూడా ప్రధాని ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications