రేపు కాకినాడ బహిరంగ సభలో వైయస్ జగన్ కీలక ప్రకటన?

YS Jagan
కాకినాడ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రేపు (గురువారం) కాకినాడలో కీలకమైన ప్రసంగం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన కాకినాడలో బస చేసి రేపు నగరంలో యాత్ర పూర్తి చేస్తారు. సాయంత్రం జగన్నాథపురం పార్క్ సెంటర్ లో వైయస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి జగన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ రీతిలో నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్రను ముగిస్తూ ఆయన ఈ సభలో కీలమైన ప్రంసగం చేస్తారని, భవిష్యత్తు వ్యూహాన్ని సూచనప్రాయంగానైనా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత ఎక్కువ మంది శాసనసభ్యులను రప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా సస్పెండ్ వేటు వేసిన అంబటి రాం బా బు సైతం కాకినాడ రాగలరని భావిస్తు న్నారు. కాకినాడ నగరంలో ఇప్ప టికే భారీ హోర్డింగులు వెలిశాయి. భాను గుడి జంక్షన్‌లో ఏర్పాటైన హోర్డింగు లో మాజీ మంత్రి కొండా సురేఖ, అం బటి రాంబాబుల ఫొటోలను ప్రము ఖంగా ఏర్పాటు చేశారు. మం త్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు జిల్లాలోని కాంగ్రెస్ శాసనసభ్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జగన్‌కు బాసటగా నిలిచే శాసనసభ్యులు కాకినాడ సభకు తరలి వస్తారని ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+