చంద్రబాబు అల్టిమేటంపై బాబ్లీ మీద దిగొచ్చిన ప్రధాని

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని సమక్షంలో ఆగస్టు 2వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ప్రధాని కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యల మధ్య ఆగస్టు 2వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications