పోలీసులు డబ్బులు తీసుకుని కేసులో ఇరికించారు: సత్యంబాబు
Districts
oi-Pratapreddy
By Pratap
విజయవాడ: విజయవాడ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు సోమవారం సంచలన ప్రకటన చేశాడు. డబ్బులు తీసుకుని పోలీసులు తనను కేసులో ఇరికించారని అతను ఆరోపించాడు. కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు అతను మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ సమయంలో అతన్ని అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇప్పటి కమిషనర్ పి. సీతారామాంజనేయులు అప్పుడు ఉండి ఉంటే కేసు ఇలా ఉండేది కాదని అతను అన్నారు.
విజయవాడ సెషన్స్ కోర్టులో తనకు న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తానని అతను చెప్పాడు. అయేషా మీరా కేసు విచారణ పూర్తయింది. ఈ నెల 25వ తేదీన తీర్పు వెలువడనుంది.