కెసిఆర్ దాడికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విరుగుడు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు దాడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుగుడు కనిపెట్టారు. ఆ విరుగుడేమిటో నిజామాబాద్ జిల్లా పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో సోమవారం వివరించారు. కెసిఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలు నిలదీసినప్పుడు గానీ సమావేశాల్లో గానీ జై తెలుగుదేశం జైజై తెలంగాణ అనే నినాదం ఇవ్వాలని ఆయన నిజామాబాద్ జిల్లా నాయకులకు ఆయన సూచించారు. తెలంగాణపై తమ నాయకుడు చంద్రబాబునే ఎందుకు అడుగుతారు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎందుకు అడగరని ప్రశ్నించాలని ఆయన హితవు చెప్పారు.

కెసిఆర్ ను రాజకీయంగా పైకి తెచ్చింది తానే అని ఆయన చెప్పుకున్నారు. మెదక్ రాజకీయాల్లో కరణం రామచందర్ రావు ప్రాబల్యం ఉన్నప్పటికీ తాను కెసిఆర్ ను ప్రోత్సహించానని ఆయన చెప్పారు. ఆనాడే కెసిఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇతర సమస్యల వల్ల తాను మంత్రి పదవి ఇవ్వలేదని, ఆనాడే మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీలో ఇబ్బందులు వచ్చి ఉండేవని, రాజకీయంగా ఇటువంటి సమస్యలు వచ్చి ఉండేవి కావని ఆయన అన్నారు. కెసిఆర్ కు అదే స్థాయిలో సమాధానం చెప్పాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

కెసిఆర్ వంచన రాజకీయాలకు పాల్పడుతున్నారని, కెసిఆర్ కు ఎదురు దెబ్బ తప్పదని ఆయన అన్నారు. సెంటిమెంటు పేరు చెప్పడమే గానీ తెలంగాణ సమస్యలు కెసిఆర్ కు పట్టడం లేదని ఆయన విమర్సించారు. తెలంగాణలో బలహిన పడిందని చెబుతూ కెసిఆర్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కెసిఆర్ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెసుకు ఇటాలియన్ అధ్యక్షురాలిగా ఉంటే ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కెసిఆర్ టికెట్లు అమ్ముకున్న తీరు ప్రజలకు తెలిసిందేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో విలీనమవుతుందో, పొత్తు పెట్టుకుంటుందో తెలియని పరిస్థితి తెరాసదని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+