వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై మళ్లీ చెప్పను: పనబాక లక్ష్మి

Panabaka Lakshmi
నెల్లూరు: తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంపై తాను ఏమీ చెప్పబోనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో తాను ఇది వరకే చెప్పానని, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనబోనని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె ఇది వరలో చెప్పారు. మీడియా ప్రతినిధులు ఎంతగా పట్టుబట్టినా ఆమె ఆదివారం సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. తన వైఖరిని రిపీట్ చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

చిన్న కుటుంబంలోనే ఎన్నో కలతలు వస్తాయని, 150 ఏళ్ల చరిత్ర గల పార్టీలో కలతలు రావడం సహజమని ఆమె అన్నారు. ఇవ్వాళ్ల కొట్టుకుంటాం, రేపు కలిసిపోతామని ఆమె అన్నారు. ప్రస్తుత పరిణామాల వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చానని, వాటిలో పాల్గొని ఢిల్లీ వెళ్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చి గెలుస్తామని, తమ హామీలను నెరవేర్చుకుంటామని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+