ధిక్కారానికి సై: పులివెందులలో వైయస్ జగన్ ఓదార్పు

పులివెందుల నియోజక వర్గంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఓదార్పు యాత్ర ద్వారా మరింత గట్టిగా పార్టీకి తన వైఖరిని స్పష్టం చేయాలని జగన్ నిర్ణయించారు. కడప జిల్లాలో అత్యధిక మంది శాసనసభ్యులను ఓదార్పులో పాల్గొనేలా చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఓదార్పుపై ప్రభావం చూపాలని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పునకు వెళ్లవద్దని ఆ జిల్లాకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా పులివెందులలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయడం ద్వారా ప్రకాశంలోనూ శాసనసభ్యులు వస్తారనే సంకేతాలను పంపాలనే దిశగా జగన్ శిబిరం దృష్టి సారించింది. మరోపక్క ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం తమకు నేరుగా చెప్పలేదు కాబట్టి తాము యాత్రలో పాల్గొంటామని కడప జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. జగన్ వర్గం వ్యూహంలో భాగంగానే మాజీ మంత్రి కొండా సురేఖను ప్రకాశం జిల్లాకు పిలిపించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications