వైయస్ జగన్ ఓదార్పుకు వైయస్ వివేకానంద రెడ్డి డుమ్మా

YS Vivekananda Reddy
పులివెందుల: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సోమవారం ప్రారంభమవుతున్న పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానందరెడ్డి అన్నారు. అమెరికాకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నానని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అందువల్ల సోమవారం ఓదార్పు యాత్రలో పాల్గొనలేక పోతున్నానని చెప్పారు. 24న హాజరవుతానని ఆయన వెల్లడించారు. జగన్ ఓదార్పు యాత్ర పులివెందులలో సోమ, మంగళవారాల్లో జరుగుతోంది.

వైఎస్ జగన్ ఎదుగుదలను ఓర్వలేక ఓదార్పు యాత్రపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో మద్దిలేటి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.సోనియా గాంధీ వద్ద మెప్పు పొందేందుకు కొందరు నాయకులు పని కట్టుకొని జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ రోజుకు కూడా అధిష్టానం సలహా మేరకే నడుచుకుంటున్నామన్నారు. సినీయర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు సరి కాదని ఆయన కొట్టి పారేశారు. వృద్ధ నాయకులకు ప్రజా స్పందన తెలియదని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఎక్కడో కూర్చొని మాయమాటలు చెప్పితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+