భూమన కరుణాకర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం

కరుణాకర్ రెడ్డి శరీరంలో చక్కెర శాతం పడిపోయింది. బిపి సాధారణ స్థాయి కన్నా తక్కువ ఉంది. వైద్యులు పరీక్షించిన తర్వాత పోలీసులు ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తన దీక్షా శిబిరాన్ని భగ్నం చేశారు గానీ తన దీక్షను భగ్నం చేయలేదని కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన ప్రాణాల కన్నా తనకు భగవంతుడి ఆలయమే ముఖ్యమని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications