మెజారిటీ కడప జిల్లా ఎమ్మెల్యేలు వైయస్ జగన్ వైపే

YS Jagan
కడప: మెజారిటీ కడప జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తోనే ఉన్నారు. కడప జగన్ సొంత జిల్లా కావడం అందుకు కారణం కావచ్చు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా తన అనుచరులకే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. కొంత మంది టికెట్లు లభించి గెలుపొందినవారికి కాంగ్రెసు పార్టీతో సంబంధాలు కూడా లేవు. దీని వల్ల ఎక్కువ మంది జగన్ వైపు ఉంటున్నారు. కడప జిల్లాలో మొత్తం పది మంది శాసనసభ్యులు ఉండగా, వారిలో తొమ్మిది మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారే. వారిలో ఐదుగురు సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. మంత్రి అహ్మదుల్లా రాజమండ్రిలో ఉన్నారు. దీంతో ఆయన ఓదార్పు యాత్రలో పాల్గొనలేకపోయారు.

తనకు రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ఇచ్చారని, అందువల్ల తాను జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఆయన మంగళవారం జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం ఓదార్పు యాత్రలో అహ్మదుల్లా కుమారుడు అస్రఫ్ పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ సోమవారంనాటి ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతిరెడ్డి జగన్ కు కలిసి సంఘీభావం తెలిపారు. కడప డిసిసి అధ్యక్షుడు సురేష్ బాబు ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+