సిఎం రోశయ్యకు జగన్ వర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లేఖాస్త్రం

Rosaiah
కడప: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు లేఖాస్త్రం సంధించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పడుతూ, వైయస్ జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావు తీరును ఎత్తిచూపుతూ ఆయన మంగళవారం ఆ లేఖ రాశారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) వేదిక దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై వారు విమర్శలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. వారు అలా మాట్లాడడానికి మీ అనుమతి తీసుకున్నారా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మీ అనుమతితోనే వారు మాట్లాడుతున్నారా అని ఆయన అడిగారు.

సిఎల్పీలో ఎవరు పడితే వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దివంగత నేత వైయస్ పై విమర్శలు చేయవచ్చా అని శ్రీకాంత్ రెడ్డి అడిగారు. సిఎల్పీ వేదికగా వారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వారి విమర్సలు పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన అన్నారు.

దివంగత నేత వైయస్ పై విమర్శలు చేస్తున్నారనే బాధతోనే తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని, ఇందులో మరో ఉద్దేశం లేదని ఆయన అన్నారు. వివాదం సృష్టించి మీడియాకు ఎక్కడం కూడా తన ఉద్దేశం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినా సిద్ధంగానే ఉన్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+