కొత్త డిజిపిగా అరవింద రావు నియామకం

Aravind Rao
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆరవిందరావును నియిమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జూన్ వరకు సర్వీసు ఉంది. గతంలో అరవిందరావు ఇంటిలిజెన్స్ ఐజీగా పనిచేశారు. డీజీపీ పదవికి అరవిందరావు, గౌతమ్ కుమార్, దినేష్‌రెడ్డిలు రంగంలో నిలిచారు. వీరి సీనియారిటీ, సర్వీస్ రికార్డులను పరిశీలించిన మీదట అరవిందరావుపై అందరు మొగ్గు చూపినట్లు తెలియవచ్చింది. ఇప్పటి వరకు ఆయన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చీఫ్ గా ఉన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సరిదిద్దగల సమర్ధత అరవిందరావుకు ఉందని కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా కితాబు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నియామకం జరిగినట్లు తెలియవచ్చింది. 1977లో ఐపీఎస్‌కు ఎంపికైన అరవిందరావు విజయవాడ కమిషనరేట్‌కు మొదటిసారిగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 1999-2002 వరకు హైదరాబాద్ అదనపు సీపీగా పనిచేశారు. తన సర్వీసులో వివిధ పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన అరవిందరావు రాష్ట్రపతి పతకంతోపాటు అనేక పురష్కారాలు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+