గ్రూప్ వన్ పరీక్ష వాయిదాను కోరుతున్న తెలంగాణ మంత్రులు

గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించారు. ఢిల్లీ నుంచి ఫోన్‌లో కాకా రోశయ్యతో మాట్లాడారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా కోరారు. తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications