నెల్లూరు జిల్లా నేతలపై వైయస్ జగన్ క్యాంప్ ఒత్తిడి

Nellore
హైదరాబాద్: ప్రకాశం జిల్లా అనుభవంతో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర విషయంలో ముందస్తు చర్యలకు దిగింది. ప్రకాశం జిల్లా ప్రభావం నెల్లూరు జిల్లా యాత్రపైనా పడే అవకాశం ఉందని జగన్ వర్గం ఆందోళన చెందుతోంది. దీంతో ఇప్పటి నుంచే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచే ఎత్తుగడలకు సన్నద్ధమవుతోంది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉంటున్న నెల్లూరు జిల్లాలోని ఆనం సోదరులను లక్ష్యంగా చేసుకొని జగన్ వర్గం విమర్శలు సంధిస్తుండడమే దానికి నిదర్శమని అఁటున్నారు. వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఆనం సోదరులు అడ్డుపడుతున్నారంటూ జగన్ వర్గానికి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. వైయస్ విగ్రహం ప్రతిష్టాపనకు తాము అడ్డు పడడం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 15వ తేదీ నుంచి ప్రకాశం జిల్లా పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రారంభమవుతుంది. పదవుల్లో ఉన్నవారికి జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు ఇబ్బందులుండొచ్చని జగన్ ను బలపరుస్తున్న నెల్లూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. యాత్ర రోడ్ మ్యాప్‌పై నెల్లూరులో ముఖ్య నేతలతో మేకపాటి చర్చించారు. ఓదార్పు యాత్ర విజయవంతానికి చేసేందుకు కాంగ్రెస్ నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో చర్చిస్తున్నామన్నారు. శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+