రామోజీ రావుపై వైయస్ జగన్ డైరెక్ట్ అటాక్

పక్కనే ఉన్న ఈటీవీ వాహనంవైపు చెయ్యిచూపుతూ "అదిగో.. ఈటీవీ, ఈనాడు. నేనే పాపం చేశాను. నాపై ఏవేవో రాస్తున్నారు. వారికితోడు మరోవ్యక్తి ఉన్నాడు. ఆయనే చంద్రబాబు అనే నాయకుడు. నేను ఓదార్పు యాత్రలో రాజకీయాలు మాట్లాడుతున్నానట. నేనెప్పుడైనా రాజకీయాలు మాట్లాడానా? ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబాలను ఓదారుస్తున్నాను. ఇందులో రాజకీయం లేదు. కుళ్లు, కుతంత్రం అంతకన్నా లేదు. ఏదైనా మాట్లాడితే ఓదార్పుయాత్రలో రాజకీయం మాట్లాడారు అంటారు. మాట్లాడకపోతే ప్రజాసమస్యలు పట్టవంటారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు" అని జగన్ అన్నారు. తన తండ్రి వైఎస్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. పావురాళ్లగుట్టలో ఇచ్చిన మాటకు నిలబడి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా యాత్ర జరిగి తీరుతుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications