కాంగ్రెసుతో తెగదెంపులకు కడప ఎంపి వైయస్ జగన్ రెడీ

ప్రకాశం జిల్లా యాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొనకుండా నివారించడంలో అధిష్టానం విజయం సాధించడంతో జగన్ వర్గంలో అసహనం పెరగుతోందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో యాత్రపై ఎన్నో జగన్ వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ప్రజాప్రతినిధులు పాల్గొనే విషయంలో నిరాశ ఎదురు కావడంతో ఆ వర్గంలో అసహనం పెరుతోందని అంటున్నారు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులలో మంత్రి బాలినేని, శివప్రసాదరెడ్డి మాత్రమే ఓదార్పులో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఒక సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉండడం, మంత్రి బాలినేని ఆధిపత్యం జిల్లాలో కొనసాగుతుండడంతో ఇక్కడ తమకు ఎదురే ఉండదని, అధిష్ఠానం మాటను పెడచెవిన పెట్టి తమ వెంట ప్రజా ప్రతినిధులందరూ వస్తారని జగన్ వర్గం ఊహించిందని, కానీ అందుకు విరుద్ధమైన పరిణామాలు ప్రకాశంలో చోటుచేసుకోవడంతో జగన్ శిబిరం కలవరపడుతోందని చెబుతున్నారు. త్వరలోనే పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో జగన్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న విషయం ఉత్కంఠగానే ఉంది.












Click it and Unblock the Notifications