సిఎం పోస్టుకు పోటీ: పురంధేశ్వరి వర్సెస్ జైపాల్ రెడ్డి

Purandeswari-Jaipal Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి మార్పు తప్పదనే ప్రచారం ఢిల్లీలో ఊపందుకుంది. ముఖ్యమంత్రిగా కె. రోశయ్యను తప్పించి ఆయన స్థానంలో చురుకైన నాయకుడికి ఆ పదవి అప్పగించాలనే ప్రయత్నంలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రులపై పట్టు సాధించలేకపోవడం, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఉన్న మంత్రుల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోవడాన్ని రోశయ్య మైనస్ పాయింట్స్ గా చూస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోశయ్య బుధవారం సాయంత్రం సచివాలయానికి వచ్చారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, వైయస్ జగన్ ను ఎదుర్కునే శక్తియుక్తులు కూడా కావాలని భావిస్తోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి మార్పు తప్పనిసరి అనే భావనతో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.

అధిష్టానం మనసెరిగిన నాయకులు ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. శాసనసభ పక్ష నేత జె. గీతారెడ్డితో పాటు శాసనసభా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ పోటీలో ఉన్నారు. దళిత మహిళ కావడం గీతారెడ్డికి ప్లస్ పాయింట్ అవుతోంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జగన్ ను ఎదుర్కోవడం తనకు సులభమవుతుందని అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు కె. జానారెడ్డి కూడా తీవ్రంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. పోటీ మాత్రం కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి మధ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జైపాల్ రెడ్డి సీనియర్ కావడం, తెలంగాణకు చెందినవాడు కావడం వల్ల ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. జగన్ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం కూడా ఆయన పేరును అధిష్టానం పరిశిలీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పురంధేశ్వరిని కూడా కొట్టిపారేయకూడదనే ఉద్దేశంతో అధిష్టానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వం ఆమె వల్ల కలిసి వస్తుందని, దాని వల్ల చంద్రబాబును ఎదుర్కోవడం సులభమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+