కాంగ్రెసు హైకమాండ్ కోరుకుందే వైయస్ జగన్ చేస్తారా?

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మరింతగా రెచ్చిపోవడం కోసం కాంగ్రెసు అధిష్టానం వేచి చూస్తోంది. పరోక్ష విమర్సలకు చర్యలు తీసుకోవడానికి సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ క్రమక్రమంగా సహనం కోల్పోతారని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఆ దశ ప్రారంభమైందని కూడా అంటున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వైయస్ జగన్ బుధవారం చేసిన విమర్శలు అందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ఇప్పుడే చర్యలు తీసుకుంటే జగన్ పై సానుభూతి పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఆ సానుభూతి లభించకుండా జగన్ తనంత తానుగా వెళ్లిపోయేలా చూడాలని లేదా తీవ్ర ఆరోపణలు చేసే దాకా ఆగాలని అనుకుంటోంది.

వైయస్ జగన్ ఎంత బయటకు చెప్పకపోయినా ముఖ్యమంత్రి పదవినే కోరుకుంటున్నారని, అందువల్ల జగన్ శాంతించే అవకాశం కూడా లేదని భావిస్తున్నారు. లక్ష్యం దూరమవుతున్న కొద్దీ జగన్ సహనం కోల్పోతారని అనుకుంటున్నారు. ఈ స్థితిలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనో పార్టీపైనో నేరుగా విమర్శలు చేసేదాకా వేచి చూసి చర్య తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. వైయస్ జగన్ ప్రస్తుత పద్ధతిలో పార్టీలో ఇమిడే పరిస్థితి కూడా లేదని అంచనా వేస్తున్నారు. తనను తాను అతి ఊహించుకుంటూ తన లక్ష్యాన్ని సాధించుకోవడమే ప్రధానంగా భావిస్తున్నారని, దీనివల్ల జగన్ ప్రస్తుత పద్ధతిలో భరించడం కూడా కష్టమని భావిస్తున్నారు. అందువల్ల సాధ్యమైనంత ఎక్కువగా రెచ్చిపోవడాన్ని అధిష్ఠానం ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+