బాలినేని శ్రీనివాస రెడ్డికి షాక్: వెళ్లిపోయి మాట్లాడాలని హెచ్చరిక

Balineni Srinivas Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం గట్టి షాక్‌ ఇచ్చింది. వైఎస్‌ కుటుంబం కోసం మంత్రిపదవి పోయినా ఫర్వాలేదంటూ పదేపదే ఆయన చేస్తున్న ప్రకటనలపై ఏఐసీసీ ముఖ్యనేత ఒకరు తీవ్రంగా స్పందించారు. అలాంటి వాటి గురించి తామేమీ పట్టించుకోమని, ప్రకటనలు చేసేవాళ్లు ముందు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. జగన్‌ వ్యవహార శైలిపై పార్టీ ఒక్కో రోజు ఒక్కో రకంగా స్పందించడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌లో మరింత అనిశ్చితి వాతావరణం నెలకొంటోంది కదా అని బుధవారం సాయంత్రం ఏఐసీసీ ముఖ్య నాయకుడొకరిని విలేకరులు ప్రశ్నించినప్పుడు "అదే మా తీర్పు" అని స్పందించారు. ప్రజాబలంతో దేశంలో ఎవరితోనైనా పోరాడతానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలనూ అధిష్ఠానం తేలిగ్గా తీసుకున్నట్లు కనబడుతోంది. విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు "నేనింకా ఏ దేశంతోనైనా పోరాడతానని అన్నాడేమో అనుకున్నా" అని వ్యంగ్యంగా బదులిచ్చారు.

ఓదార్పు యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారన్న వాదనను తాము పట్టించుకోవడం లేదనీ, అది చాలా పాత విషయమని కొట్టిపారేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అనారోగ్యం, మరోవైపు జగన్‌ దూకుడు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి కదా? అని విలేకరులు అన్నప్పుడు 'మాకు లేని ఆందోళన మీకెందుకు' అని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని, దేన్ని ఎలా నియంత్రించాలో తమకు బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి జగన్‌ అధిష్ఠానాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ తనపై పార్టీ చర్య తీసుకొనేలా చేసుకొని, ఆ సానుభూతితో బయటికెళ్లాలని వేసుకున్న పథకాన్ని పారనీయకూడదనేది ఏఐసీసీ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+