ఆస్తుల గొడవ: వైయస్ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పోరు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మధ్య మొదలైంది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ కు తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు జగన్ రెండు పోరాటాలు చేయాల్సిన స్థితిలో పడ్డారు. వైయస్ జగన్ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. బెంగళూర్ లోని వైయస్ జగన్ రాజభవనం తీవ్ర వివాదంగా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ భవనం చిత్రాన్ని కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేసి వివాదానికి తెర తీశారు. అంతేకాకుండా ఆయన అక్రమాస్తుల గుట్టు కూడా విప్పారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి, అక్రమాలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆస్తులపై బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాదనను మరో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు సమర్థించారు. బెంగళూర్ భవనం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెసు నాయకులు జగన్ కు బాసటగా నిలబడడం లేదు. నిజానికి, కాంగ్రెసులోని జగన్ వ్యతిరేకులు వైయస్ హయాంలోని నిర్ణయాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెసులోని అంతర్గత శత్రువులను తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తూ వస్తున్న జగన్ వర్గంపై తెలుగుదేశం పార్టీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు ఆస్తులపై వారు చర్చను ముందుకు తెచ్చారు. మలేషియా, సింగపూర్ ల్లో చంద్రబాబు హోటళ్లపై, హెరిటేజ్ పై దృష్టి సారించారు. చంద్రబాబుపై ఎదురు దాడికి దిగారు. కాంగ్రెసు రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై, రామోజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి, తమ తమ ఆస్తులపై వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నిండు శాసనసభలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్ ఆస్తులే కాకుండా చంద్రబాబు ఆస్తులు కూడా పెరిగాయనేది నిజమని రాజకీయ వర్గాలంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+