కోరుట్ల: పార్టీని పెట్టుకుని ఎమ్మెల్యే టికెట్లను లక్షలాది రూపాయలకు చిరంజీవే అమ్ముకున్నాడని, ఓయూ జెఎసి విద్యార్ధులు కొమరం పులి సినిమాను డబ్బులు డిమాండ్ చేసి అడ్డుకున్నారనడం సబబు కాదని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీగౌడ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తని ఆయన చెప్పారు. కోరుట్ల పట్టణంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీం పేరును సినిమాకు వాడుకోవ డాన్ని తెలంగాణవాదులు వ్యతిరేకించారన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆశపడ్డ చిరంజీవి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఎద్దేవాచేశారు. ఓ ఇంటి మోచేతి నీళ్లు తాగి తనను విమర్శించడం తగదని. తాను తెలంగాణ కోసం నాటినుండి పోరాడుతున్నానని తెలిపారు. చిరంజీవి తెలంగాణలో పర్య టించిన సమయంలో సామాజిక తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటానని అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.