హైదరాబాద్: ఏసిబి వలలో మరో తిమింగలం పడింది. హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కు చెందిన ఆర్ఐ సుభాష్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఏసిబి దాడులు నిర్వహించింది. అల్వాల్ లోని ఆయన ఇంటిలో బుధవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది. ఏసిబి నాలుగు జట్లుగా ఏర్పడి ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ దాడులు ప్రారంభించారు. దాడులకు ముందు గత నెలరోజులుగా ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అనంతరం పూర్తి సమాచారం సేకరించిన అనంతరం ఈరోజు దాడులు నిర్వహించింది. సుభాష్ పై అనేక ఫిర్యాదులు సైతం వచ్చినట్టు సమాచారం. ఆయన సంపాదన అక్రమమా, సక్రమమా, ఎంత అనేది అంచనా వేస్తున్నారు.