హైకోర్టు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అడ్డుకున్న పోలీసులు

హైకోర్టులో మా వాటా మాకు వచ్చేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. లోపల ఒక బ్లాక్ పూర్తిగా స్తంభించి పోయిందని, మిగతా కోర్టు అంతా అదే పరిస్థితికి వస్తుందన్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. లోపల ధర్నాలో న్యాయవాదుల ఆరోగ్యం క్షీణిస్తోందని, అందులో మహిళలు సైతం ఉన్నారన్నారు.
కాగా ధర్నా సందర్భంగా న్యాయవాదులు కోర్టుకు తాళాలు వేశారు. నాంపల్లి, సికిందరాబాద్ కోర్టులనుండి న్యాయవాదులు భారీగా హైకోర్టుకు తరలి వచ్చారు. కోర్టుకు తాళం వేయడంతో కొందరు గేట్లు దూకి నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావం తెలపడానికి వెళ్లారు. దీంతో అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications