హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి హయాంలో ఎపిఐఐసి ఎమ్మార్ స్కామ్ నిజమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: అంబటి రాంబాబు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎపిఐఐసి ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం నిజమేనని సొలిసిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనాడు దినపత్రిక గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ నగరంలో విలువైన భూములను కొల్లగొట్టేందుకు ఎమ్మార్‌ సంస్థ అక్రమాలకు, అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన మాట వాస్తవమేనని భారత సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయపడ్డారు. ఎమ్మార్‌ సంస్థ ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ తుంగలో తొక్కి 'జాయింట్‌ వెంచర్‌' అన్న భావనకే తూట్లు పొడుస్తూ భారీ అక్రమాలకు పాల్పడిందని సొలిసిటర్‌ జనరల్‌ గోపాల్‌ సుబ్రమణ్యం కచ్చితమైన నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా తెలుపుతూ గత శనివారమే ఏపీఐఐసీకి అభిప్రాయ నివేదిక పంపించారు. ఆయన ఒక్కరే కాదు, ఎమ్మార్‌ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వ సూచనతో ఏపీఐఐసీ నియోగించిన ప్రత్యేక నిపుణుల కమిటీ కూడా ఈ మాటే తేల్చి చెప్పింది. అక్రమాలు ఇంత ప్రస్ఫుటంగా కనబడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఎమ్మార్‌తో ఒప్పందాన్ని రద్దు చేయాలని, అక్కడ భూముల రిజిస్ట్రేషన్లను ఆపెయ్యాలనీ, ఇప్పటికే రిజిస్టర్‌ అయిన వాటిని తిరిగి ఎలా రాబట్టాలో కూడా ఆలోచించాలని అటు సొలిసిటర్‌ జనరల్‌, ఇటు నిపుణుల కమిటీ గట్టిగా సూచించినట్లు ఈనాడు దినపత్రిక రాసింది. ఏపీఐఐసీ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించిన వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలనీ, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఓ ప్రత్యేక విచారణ కమిషన్‌ వెయ్యాలని కూడా నిపుణుల కమిటీ సూచించటం అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ రెండు నివేదికలను తాము సంపాదించామని ఈనాడు దినపత్రిక రాసింది.

ఒప్పందాల ఉల్లంఘన ఎలా జరిగిందో కూడా ఈనాడు దినపత్రిక వివరంగా రాసింది. అక్రమాలకు రాచబాట వేయడానికి ఎంజిఎఫ్ అనే సంస్థను ముందుకు తెచ్చినట్లు కూడా ఆరోపించింది. తన హక్కులన్నింటినీ ఎంజీఎఫ్‌కు కట్టబెట్టి దానికి మళ్లీ తానే పూచీకత్తుగా నిలబడే బదులు.. అసలు ఎమ్మార్‌హిల్స్‌ సంస్థే నేరుగా బ్యాంకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా ఆ మార్గాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? దీన్నిబట్టి చూస్తుంటే- ఎంజీఎఫ్‌ తనతో నిధులు తెస్తుందని కాదు, దాని ద్వారా నిధులను బయటకు దండుకునేందుకే ఎంజీఎఫ్‌ను రంగం మీదికి తెచ్చారని అర్థమవుతోందని నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు వివరించింది. ఎమ్మార్ హిల్స్ లోకి 2005 మేలోనో ఫెయిర్ బ్రిడ్జి హోల్డింగ్స్ అనే మూడో సంస్థను పట్టుకొచ్చేందుకు ప్రయత్నించారని ఈనాడు రాసింది. ఎమ్మార్‌లోనూ, ఎంజీఎఫ్‌లోనూసీనియర్‌ ఉద్యోగులంతా ఒకరే కావటం చూస్తే కేవలం ఎమ్మార్‌హిల్స్‌ జాయింట్‌ వెంచర్‌లో నిథులను కొల్లగొట్టేందుకు, ఏపీఐఐసీని కేవలం రబ్బర్‌స్టాంపు సంస్థగా మార్చేందుకే ఎమ్మార్‌ పథకం వేసిందని స్పష్టమవుతోందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు.

ఏపీఐఐసీ తరఫున ఎమ్మార్‌హిల్స్‌ సంస్థలో నామినీ డైరెక్టర్‌గా వ్యవహరించిన బి.పి.ఆచార్య వ్యవహార శైలిపై సొలిసిటర్‌ జనరల్‌ సందేహాలు వ్యక్తం చేశారని ఈనాడు దినపత్రిక రాసింది. ఏపీఐఐసీ నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే ఎమ్మార్‌హిల్స్‌ సంస్థ గృహవాణిజ్య సముదాయాల అభివృద్ధి బాధ్యతలను, ఆర్థిక లావాదేవీల హక్కులను ఎంజీఎఫ్‌కు కట్టబెడుతున్నా ఆ బోర్డులో ఏపీఐఐసీ నామినీ డైరెక్టర్‌గా ఉన్న బి.పి.ఆచార్య ఏం చేస్తున్నట్లని సొలిసిటర్‌ జనరల్‌ వ్యాఖ్యానించారని తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X