ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను కనిపెట్టగలరా ?
ఓ ఆసక్తికరమైన బ్రెయిన్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కనిపించే ఈ పజిల్, నిజానికి మీ పరిశీలనా శక్తి ఎంత పదునుగా ఉందో పరీక్షించే ఛాలెంజ్‌గా మారింది. "మ్యాన్ ఆఫ్ స్టీల్" స్థాయి దృష్టి మీకుందా? అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక పజిల్‌ను రివర్స్‌వాల్ఆర్ట్ బృందం రూపొందించింది. ఇందులో ఒక చిన్నారి సూపర్ హీరో బెడ్‌రూమ్‌కు సంబంధించిన రెండు రంగురంగుల చిత్రాలు కనిపిస్తాయి.
గది మొత్తం సూపర్ హీరో పోస్టర్లు, గ్రహాలు, రాకెట్‌లు, అంతరిక్ష వస్తువులతో నిండి ఉండటంతో ఇది ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. మొదటి చూపులో రెండు చిత్రాలు ఒకేలా కనిపించినప్పటికీ, వాటిలో ఐదు చిన్న తేడాలు దాగి ఉన్నాయి. అవే ఇప్పుడు ఈ పజిల్‌లో అసలు సవాలు. ఈ పజిల్‌ను పూర్తి చేయడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే. అంత తక్కువ సమయంలో ఐదు తేడాలను గుర్తించగలిగితే, మీ పరిశీలనా నైపుణ్యం అసాధారణమని చెప్పొచ్చు.

చాలామంది మొదటి రెండు లేదా మూడు తేడాలను గుర్తించినా, మిగతా తేడాలు మాత్రం చాలా సూక్ష్మంగా ఉండటంతో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని మార్పులు గోడ పోస్టర్లలో ఉండగా, మరికొన్ని చిన్న వస్తువుల ఆకారాలు లేదా రంగుల్లో దాగి ఉంటాయి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్స్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. నిపుణుల ప్రకారం ఇవి మెదడుకు మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. ప్రత్యేకంగా పిల్లలు, యువతలో మెదడు చురుకుదనాన్ని పెంచేందుకు ఇలాంటి పజిల్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్‌లో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. మన కళ్లకు కనిపించే ప్రతిదీ నిజం కాదు. మెదడు ఒకేసారి మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంతో చిన్న మార్పులు దృష్టికి రావు. అందుకే ఈ పజిల్స్‌లో ప్రతి మూలను నిశితంగా గమనించాలి. కొన్ని తేడాలు కేవలం రంగు షేడ్స్‌లో ఉండొచ్చు. మరికొన్ని వస్తువుల స్థానం మారినట్టు కనిపిస్తాయి. 10 సెకన్లలో ఐదు తేడాలను గుర్తించగలిగితే, మీ పరిశీలనా శక్తి నిజంగానే సూపర్ హీరో స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఒకవేళ గుర్తించలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌ను తరచూ ప్రయత్నిస్తే మెదడు మరింత చురుకుగా మారుతుంది. అయితే ఒకసారి టైమర్ పెట్టుకుని మీరు కూడా ఈ సూపర్‌మ్యాన్ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పోటీ పెట్టి ఎవరి దృష్టి పదునో తెలుసుకోండి!












Click it and Unblock the Notifications