నీట్ యూజీ 2026 లీక్: పూణేలో మరో టీచర్ అరెస్ట్ !!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక పురోగతి సాధించింది. ఫిజిక్స్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన ఆరోపణలపై పుణెకు చెందిన ఓ అధ్యాపకురాలిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తరఫున ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలు నిర్వహించిన ఆమెపై తీవ్ర ఆరోపణలు వెలువడడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

సీబీఐ అదుపులోకి తీసుకున్న అధ్యాపకురాలు మనీషా సంజయ్ హవల్దార్ పుణెలోని సేథ్ హిరాలాల్ సరఫ్ ప్రశాలలో పనిచేస్తున్నారు. నీట్-యూజీ 2026 పరీక్షల కోసం ఫిజిక్స్ విభాగ నిపుణురాలిగా NTA ఆమెను నియమించింది. ఈ హోదాలో ఆమెకు ప్రశ్నపత్రాల రూపకల్పన, ఎంపిక, సెట్‌ల పరిశీలన వంటి కీలక బాధ్యతలు అప్పగించబడినట్లు అధికారులు వెల్లడించారు.

cbi-arrests-one-more-teacher-in-neet-ug-2026-physics-paper-leak-at-pune-and-investigation-goes-on

దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆమె డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సందేశాల రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించినట్లు సమాచారం. విచారణలో పలు కీలక ఆధారాలు లభించడంతోనే ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2026లో మనీషా హవల్దార్ ఫిజిక్స్ ప్రశ్నలను సహ నిందితురాలు మనీషా గురునాథ్ మాంధారేతో పంచుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఆమె పంపిన ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నపత్ర సెట్‌లతో సరిపోలినట్లు అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కోసం ప్రత్యేకంగా సంకేత పదాలు, మెసేజింగ్ యాప్‌లు, మధ్యవర్తుల సహాయం ఉపయోగించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరు విద్యాసంస్థల సిబ్బంది, కోచింగ్ సెంటర్ల పాత్రపై కూడా సీబీఐ దృష్టి సారించింది.

దేశవ్యాప్తంగా 11 మంది అరెస్టు

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ, జైపూర్, గుర్గావ్, నాసిక్, పుణె, లాతూర్, అహిలియానగర్ ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించిన అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగమైన పీవీ కులకర్ణి, జువాలజీ మరియు బోటనీ విభాగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను యాక్సెస్ చేసిన మనీషా గురునాథ్ మాంధారేలను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టయిన అధ్యాపకుల్లో ఎక్కువమంది పుణెకు చెందిన వారే కావడం గమనార్హం.

కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై అనుమానం

ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక భారీ డబ్బు లావాదేవీలు జరిగి ఉండొచ్చని సీబీఐ అనుమానిస్తోంది. కొన్ని కోచింగ్ సెంటర్లు, మధ్యవర్తులు, విద్యార్థుల కుటుంబాల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ చెల్లింపులు, కాల్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్‌లను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసు పరిధి మరింత విస్తరించే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

పరీక్షల విశ్వసనీయతపై ఆందోళనలు

దేశంలో వైద్య విద్య ప్రవేశాలకు అత్యంత కీలకమైన పరీక్షగా గుర్తింపు పొందిన నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతుండగా, ఇలాంటి ఘటనలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని, పరీక్షా విధానంలో సాంకేతిక భద్రతా చర్యలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని అరెస్టుల అవకాశం

ఈ కేసులో ఇంకా పలువురు అనుమానితులపై సీబీఐ నిఘా కొనసాగిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా దాడులు జరిగే అవకాశముందని సమాచారం. ప్రశ్నపత్రాలు ఎలా బయటకు వెళ్లాయి? ఎవరెవరికి చేరాయి? పరీక్షకు ముందు ఎన్ని గంటలకే లీక్ అయ్యాయి? అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయగా, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+