హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పేషీపై ధ్వజమెత్తిన సాక్షి డైలీ: విశాఖ భూముల గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడొకరికి 300 కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం వేగంగా కదిలిందని సాక్షి డైలీ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. బడుగులు భూమిపై పచ్చ పాము అనే పతాక శీర్షిక కింద కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక రాసింది. సాక్షి దినపత్రిక వార్తాకథనం ఇలా సాగింది - రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో 200 కోట్ల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకుడికి కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖపట్నంలో 360 కోట్ల విలువైన భూమిని విపక్షానికి చెందిన మాజీ ఎంపీకి అప్పగించేందుకు సంసిద్ధమవుతోంది. బడుగులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తానని ఆ మాజీ ఎంపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకున్నదే తడవుగా సీఎం కార్యాలయం సత్వరం స్పందించింది. ఆ భూముల వాస్తవ పరిస్థితిని తెలియజేయాలంటూ సీసీఎల్‌ఏను, విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది.

సీఎం కార్యాలయం నుంచి ఫైలు వచ్చిందే తడవుగా విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు కూడా అత్యంత వేగంగా స్పందిస్తున్నట్లు సమాచారం. అసైన్డ్ భూమి డీఫామ్ పట్టాలను రద్దుచేస్తే, ఆ భూమి ప్రభుత్వ పరమవుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు భూమి తీసుకోవాలన్నది ఆ మాజీ ఎంపీ పథకంగా తెలుస్తోంది. అందుకు సీఎం కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారుల వరకూ అందరూ సహకరిస్తున్నారని అర్థమవుతోంది. ఆ ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో వివరిస్తూ ఆ భూముల వివరాలను కూడా సాక్షి దినపత్రిక ఇచ్చింది.

సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - వైఎస్ మరణానంతరం సదరు టీడీపీనేత తాజాగా భూముల స్వాధీనానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 7.25 ఎకరాల భూమితోపాటు, యూనివర్సిటీ పక్కనే ఉన్న 28.8 ఎకరాల అసైన్డ్ భూములను సైతం కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ భూముల డీ-ఫాం పట్టాలున్న పేద రైతులను సంప్రదించి ఆ భూములను కొనుగోలు చేసేందుకు అనుమతించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ 36 ఎకరాల భూమిలో దూర విద్యా కేంద్రంతోపాటు, వినూత్న కోర్సులు ప్రవేశపెట్టడానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రభుత్వానికిచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ భూముల కోసం ఆ మాజీ ఎంపీ సీఎంకి దరఖాస్తు చేసుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏ విధంగా కదిలింది కూడా సాక్షి దినపత్రిక వివరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X