హెరిటేజ్ ఆస్తులను తెలంగాణ ప్రజలు అడుగతలేరు: తెరాస

నాగం జనార్దన్ రెడ్డికి ఓసారి దేహశుద్ధి చేసినా చిత్తశుద్ధి రాలేదని వారు వ్యాఖ్యానించారు. మెడలు తిప్పడం కూడా చేతగాని నాగం జనార్దన్ రెడ్డికి కెసిఆర్ విమర్శించే అర్హతం లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారని వారన్నారు. తెలంగాణ పల్లెల్లోకి పోతే తెలుగుదేశం నాయకులను ప్రజలు బండబూతులు తిడుతున్న విషయం తెలుస్తుందని వారు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోలేకనే కెసిఆర్ పై ఏదో రకమైన విమర్శలు చేస్తున్నారని వారన్నారు. ఏదో ఒక రోజు చంద్రబాబు చావుకేక పెడతారని వారన్నారు. చంద్రబాబు చేత శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇప్పిస్తే తెలుగుదేశం నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారని వారన్నారు. తెలంగాణ ఉద్యమానికి పట్టిన తెగులు తెలుగుదేశం పార్టీ అని వారు వ్యాఖ్యానించారు. నాగం జనార్దన్ రెడ్డి ఒళ్లు ఎలా పెరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసునని వారన్నారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications