వైయస్ జగన్ మంత్రులకు మరింత వెసులుబాటు

Pilli Subhash Chandrabose
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులకు మరింత వెసులుబాటు లభించే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్ కు మద్దతు ఇస్తున్న మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను ఇప్పుడిప్పుడే మంత్రివర్గం నుంచి తొలిగించే పరిస్థితి లేదు. దీంతో వారికి చాలా వరకు ఊరట లభించినట్లే. ఈ ఇద్దరిని విడిగా మంత్రివర్గం నుంచి తప్పించకుండా మంత్రివర్గ విస్తరణలో భాగంగానే వారిని తొలగించి కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రోశయ్య ఉన్నారు. తన మాట వినేవారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెబుతూ ఆ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి. అయితే, సెప్టెంబర్ చివరి నాటికి మంత్రి వర్గం విస్తరణ జరుగుతుందని భావిస్తూ వస్తున్నారు. కానీ అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితులున్నాయి. కామన్ వెల్త్ క్రీడలు, కాశ్మీర్ సమస్య, అయోధ్య తీర్పు వంటి అంశాలు అధిష్టానం రాష్ట్రంలో ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా చేపట్టే మార్పులు చేర్పులపై దృష్టి సారించే పరిస్థితిలో లేదు. దీంతో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అక్టోబర్ లో గానీ జరిగే అవకాశాలు లేవని అంటున్నారు.

రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టడానికి రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అంటున్నారు. అయినా రోశయ్య అందుకు పూనుకోవడం లేదని సీనియర్ శాసనసభ్యుల్లో కొంత నిర్లిప్తత చోటు చేసుకుంది. జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, పి. శంకరరావు, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు పలువురు మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. మంత్రివర్గం పునర్వ్యస్థీకరణలో జాప్యం జరుగుతుండడంతో బాలినేని శ్రీనివాస రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇప్పటికిప్పుడే ఉద్వాసన పలికే స్థితి లేదు. ఇది వారికి చాలా వరకు ఊరటనిచ్చే విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+