మొదటి భార్యకు భరణం ఇవ్వాలని చిత్రం శ్రీనుకు ఆదేశాలు
State
oi-Pratapreddy
By Pratap
మహబూబ్ నగర్: సినీనటుడు 'చిత్రం" శ్రీనుపై భరణం వేటు పడింది. శ్రీను మొదటి భార్య ఉమామహేశ్వరి స్థానిక ఫ్యామిలీకోర్టులో భరణం ఇవ్వాలని భర్తపై కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి రాఘవరావు సోమవారం తీర్చు ఇచ్చారు. శ్రీను తన భార్యను పట్టించుకోకపోవడం వల్ల ఆమె జీవనానికి నెలకు రూ. 10 వేలు చెల్లించాల్సిందిగా న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
గతంలో కోర్టు కేసు కోసం మహబూబ్ నగర్ వచ్చిన చిత్రం శ్రీనుపై, ఆయన రెండో భార్యపై ఉమా మహేశ్వరి మనుషులు దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. శ్రీనుపై ఉమా మహేశ్వరి దాడికి ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి.