హైదరాబాద్: అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. గురువారం అయోధ్యపై తుది తీర్పు రాబోతున్నందున నగర పోలీస్ కమిషనర్ ఎకే ఖాన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటినుండి తీర్పు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఆధికారులకు సూచించారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డాగా ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు.