అయోధ్య తీర్పుపై స్టే ఎత్తివేత: అలహాబాదు కోర్టుకు లైన్ క్లియర్

ఈ విషయంలో కోర్టు వెలుపల సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్రం సిద్ధమేనని, ఆ విషయంపై అనిశ్చితి కొనసాగటంపై భావ్యం కాదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. మేం వాయిదాలు కోరుకోవటం లేదని ప్రకటించింది. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో అఖిల భారత హిందూ మహాసభ అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మించాల్సిందేనంటూ నినాదాలు చేశాయి.
ఈ నెల 17న అయోధ్య విషయంలో హిందూ సంస్థలు, ముస్లిం సంస్థల మధ్య సయోధ్య కుదర్చడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 23న అయోధ్య తీర్పుపై అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వటానికి రెండు రోజుల ముందు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన రమేష్ త్రిపాఠీ బీహార్ ఎన్నికలు, కామన్ వెల్త్ గేమ్స్ నేపథ్యంలో తీర్పును వాయిదా వేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసారు. పిల్ వేసిన రోజు దానిని తోసిపుచ్చిన ధర్మాసనం మరుసటి రోజు తీర్పును వారం పాటు అనగా 28 వ తేదికి వాయిదా వేస్తూ అలహాబాద్ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటీకీ తాము ఆవేశంతో రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోమని హిందూ సంస్థలు, ముస్లిం లీగ్ ప్రకటించాయి.












Click it and Unblock the Notifications