హైదరాబాద్ లో రెడ్ అలర్ట్: భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ నగరం మొత్తం బంద్ ప్రాంతాన్ని తలపిస్తుంది. అవసరాన్ని బట్టి అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయించారు. ఎవరైనా హింసాయుత ఘటనలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 500 మంది అనుమానితులను పోలీసును ఆదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల యజమానులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.
తీర్పు ఎలా వచ్చినా అందరూ శాంతియుతంగా ఉండాలని మతపెద్దలు, ప్రభుత్వం, పోలీసు అధికారులు, మీడియా ఎప్పటికప్పుడు ప్రజలను కోరుతుంది. సహనం పాటించాలంటూ సామరస్యంతో మెలగాలంటూ పలు సంఘాలు శాంతి ర్యాలీలు తీస్తున్నాయి. విజయవాడలో విద్యార్థులతో శాంతిర్యాలీ నిర్వహించారు. భరతమాత, వివిధ మత పెద్దల రూపంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. హిందూ ముస్లిం భాయీ భాయీ, భారత సమైఖ్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసారు.












Click it and Unblock the Notifications