వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధిష్టానం మరో షాక్

జగన్ వర్గీయుడైన నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేతకు ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పదవినుంచి తొలంగించడంతో పాటు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇటీవల ఆనం వివేకానందరెడ్డిపై, అనంతరం ప్రభుత్వానికి, రోశయ్యకు వ్యతిరేకంగా కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డ పిసిసి ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
జగన్ ఓదార్పును సమర్థిస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లూడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడమని మూడు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశాడు. అందుకు తగ్గట్టుగానే నాయకత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటోంది. అంబటి రాంబాబుతో మొదలైన వేటుల పర్వం పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది. నాయకత్వం జగన్ వర్గీయుల మాటలపై కొంత చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నప్పటీకీ వారి మాటలు శృతిమించటంతో వారిపై వేటుకు సిద్ధమవుతోంది.
టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన, వరంగల్ జిల్లా శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖపైనా చర్యలు తీసుకునే దిశలో నాయకత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి రోశయ్యను తప్పుపడుతూ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక కొండా సురేఖ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పటంపై పార్టీ జిల్లా నాయకుడు ఒకరు ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధినాయకత్వాన్ని కోరారు.
దీనిపై స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ఓదార్పుకు తాను అనుకూలంగా ఉన్నందువల్లనే తనపై వేటు వేసిందని ఆయన ఓ టీవీ షోలో ఫోన్ ద్వారా చెప్పారు. తను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసినట్టు పార్టీ అధినాయకత్వం నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధం అని ఆయన అన్నారు. తాను ఏ నాయకుడికి వ్యతిరేకినిగాని ఆనుకూలుడను గాని కాదని, ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నానని, తన గురించి జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. జగన్ ఓదార్పు కాంగ్రెసు కే లాభమని, కాంగ్రెసు కు లాభించే ఏ కార్యక్రమంలోనైనా తాను పాల్గొనడానికి సిద్ధమేనన్నారు. తనపై వేటు వేసిన నాయకులు జిల్లాకు వచ్చి తాను కాంగ్రెసు కు చేసిన సేవల గురించి ప్రజలను ఆడగాల్సిందిగా సవాల్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications