మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని రావిచేడులో కసాయితండ్రి తన ముగ్గురు పిల్లలను బావిలో వేసి చంపివేసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావటం లేదనే నిస్పృహలో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు సమాచారం. అయితే తన పిల్లలను ఆయన చూసుకుంటాడని అనుకున్నానని గాని, ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లి ఏడుస్తోంది.