జగన్ చేపడుతున్న ఓదార్పు వ్యక్తిగతం: కేంద్రమంత్రి పనబాక

Panabaka Lakshmi
విశాఖపట్నం: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి విశాఖపట్టణంలో పేర్కొన్నారు. విశాఖలోని షెడ్యుల్డు కులాలకు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె విలేకరులతో జగన్ ఓదార్పు గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదని, అది ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31న నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని అమె చెప్పారు. షెడ్యుల్టు కులాల కోసం అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు ప్రభుత్వం ప్రభుత్వంగాని ఎంతో చేస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం షెడ్యుల్డు కులాలు సంఘాలు మంత్రిని సన్మానించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+