తెలంగాణపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ఫైనల్

టిజి వెంకటేష్ గురువారం మొయిలీని, చిదంబరాన్ని కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు అందరూ కట్టుబడి ఉండాలని ఆ ఇద్దరు నేతలు తనకు చెప్పినట్లు టిజి వెంకటేష్ చెప్పారు. దీన్ని బట్టి శ్రీకృష్ణ కమిటీ చేసే సిఫార్సుల మేరకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు రాష్ట్రం కావాల్సిందేనని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కమిటీ ఇచ్చే నివేదికపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications