జగన్ ది ఓదార్పు కాదు ప్రజలను హింసించే యాత్ర: నారాయణ

జగన్ చల్లకొచ్చి ముంత దాచినట్లు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించాడు. రాజకీయాల్లో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి జగన్ ఇప్పుడు ఓదార్పును కొనసాగిస్తున్నాడని, ఓదార్పు రాజకీయం కాకుంటే ఇంత నెమ్మదిగా ఇంత మందీ మార్బలంతో ఇన్నాళ్లు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆ ఓదార్పు ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియకుండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేపడుతున్న యాత్ర ప్రజలను ఓదార్చడం మాని వారిని మరింత బాధపెడుతూ ప్రజా హింస యాత్రగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications