Vitamin B12: బ్రెయిన్ క్యాన్సర్‌కు బ్రేక్.. శాస్త్రవేత్తల చేతికి దొరికిన సరికొత్త అస్త్రం!

బ్రెయిన్ క్యాన్సర్‌లలో అత్యంత ప్రమాదకరమైన 'గ్లియోబ్లాస్టోమా' చికిత్సలో వైద్య ప్రపంచం ఒక సరికొత్త మైలురాయిని అధిగమించింది. సాధారణంగా ఈ భయంకర వ్యాధి బారిన పడిన రోగులు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ వంటి ఎన్ని చికిత్సలు తీసుకున్నప్పటికీ 15 నెలల కంటే ఎక్కువ కాలం బతకడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. అలాంటి మొండి క్యాన్సర్‌కు 'విటమిన్ బి12' సహాయంతో గట్టి చెక్ పెట్టవచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 'నైట్రోసిల్ కోబాలమిన్' (NO-Cbl) అనే రసాయన సమ్మేళనం ఈ ప్రాణాంతక క్యాన్సర్ కణాల ముక్కుతాడు తెంచగలదని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఔషధాల ప్రవేశాన్ని అడ్డుకునే 'కవచాన్ని' దాటి..

గ్లియోబ్లాస్టోమా చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా వైద్యులను ఇన్నాళ్లూ వేధిస్తున్న అతిపెద్ద సవాలు 'బ్లడ్-బ్రెయిన్ బారియర్' (BBB). ఇది మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా ప్రకృతి ప్రసాదించిన ఒక సహజ రక్షణ కవచం. అయితే, క్యాన్సర్‌ను నయం చేసే ప్రాణరక్షక మందులను కూడా ఇది లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. కానీ, విటమిన్ బి12 ఆధారిత రసాయనమైన 'నైట్రోసిల్ కోబాలమిన్' ఈ బలమైన కవచాన్ని సైతం ఈజీగా దాటుకుని, నేరుగా మెదడులోని క్యాన్సర్ కణితి (ట్యూమర్) లోకి ప్రవేశించగలదని తాజా ప్రయోగాల్లో నిరూపితమైంది.

Brain Cancer Breakthrough Vitamin B12 Based Compound Successfully Crosses BBB To Target Glioblastoma

విటమిన్ బి12 అస్త్రం క్యాన్సర్‌ను ఎలా వేటాడుతుంది?

ప్రముఖ పరిశోధకుడు జోసెఫ్ ఎ. బాయర్ (క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ఫౌండేషన్) నేతృత్వంలో సాగిన ఈ ప్రయోగంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విటమిన్ బి12 రూపాంతరమైన NO-Cbl, క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేసేందుకు అవసరమైన 'నైట్రిక్ ఆక్సైడ్‌'ను విడుదల చేస్తుంది. జంతువులపై చేసిన పరిశోధనల ప్రకారం, ఈ సమ్మేళనం శరీరంలోని ఇతర భాగాల కంటే మెదడులోని క్యాన్సర్ ప్రభావిత ప్రాంతంలోనే దాదాపు 24 గంటల కంటే ఎక్కువ సమయం క్రియాశీలకంగా ఉండి క్యాన్సర్ కణాలను దెబ్బతీస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం వాడుతున్న 'టెమోజోలోమైడ్' కీమోథెరపీ మందుతో కలిపి దీనిని ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాల పెరుగుదల చాలా వేగంగా అణచివేయబడింది.

దోమలతో వ్యాక్సినేషన్.. శాస్త్రవేత్తల క్రేజీ ఐడియా!
దోమలతో వ్యాక్సినేషన్.. శాస్త్రవేత్తల క్రేజీ ఐడియా!

మొండి కణాల ఆత్మహత్య.. త్వరలోనే మానవ ప్రయోగాలు

గ్లియోబ్లాస్టోమా కణాలు చాలా మొండిగా ఉండి, చికిత్సలకు లొంగకుండా తప్పించుకుంటూ ఉంటాయి. అయితే, ఈ కొత్త నైట్రోసిల్ కోబాలమిన్ ఆ మొండి కణాల నిరోధక శక్తిని బద్దలు కొడుతుంది. క్యాన్సర్ కణాలు బతకడానికి వాడుకునే ప్రమాదకర రసాయన సంకేతాలను అడ్డుకుంటూ.. అవి తమంతట తామే నశించిపోయేలా (ఆత్మహత్య చేసుకునేలా) చేస్తుంది.

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?
భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?

ఈ ప్రయోగ ఫలితాలు ప్రముఖ 'ఒంకోసైన్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది ప్రాథమిక స్థాయి పరిశోధన మాత్రమేనని, రాబోయే రోజుల్లో మానవులపై క్లినికల్ ప్రయోగాలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైతే, బ్రెయిన్ క్యాన్సర్ బాధితులకు ఒక శాశ్వత మరియు సురక్షితమైన పరిష్కారం లభిస్తుందని పరిశోధక బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+