అమర్‌నాథ్ యాత్రకు వేళాయె: జులై 3 నుంచి: రిజిస్ట్రేషన్, నిబంధనలు, ఏర్పాట్లు ఇలా

హిమాలయాల మంచు కొండల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ శైవ క్షేత్ర దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే ఈ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్‌లో సుమారు 3,888 మీటర్ల ఎత్తు గల ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోన్నారు.

దాదాపు నెలన్నర రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షా బంధన్ పండుగ పర్వదినంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ బోర్డ్‌తో పాటు స్థానిక జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనను పూర్తి చేసింది. ఈ సారి రికార్డు స్థాయిలో తరలిరావచ్చని భావిస్తున్న యాత్రికులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Amarnath Yatra set to start On July 3 to till August 9 Registration Latest Essential Security Guidelines

యాత్ర సాఫీగా సాగేలా చూడడానికి వీలుగా గుహాలయానికి వెళ్లే రోడ్లను మరమ్మతు చేశారు. దారిపొడవునా వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అత్యవసర సహాయక చర్యలు తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన కొండ దారులలో ప్రయాణించాల్సి ఉన్నందున యాత్రికుల భద్రత కోసం భారీగా బలగాలను మోహరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తక్షణమే స్పందించేందుకు వీలుగా విపత్తు నిర్వహణ బలగాలు, అత్యవసర వ్యవస్థలు మార్గమధ్యంలో నిరంతరం అందుబాటులో ఉంటాయి.

భద్రత, ప్రయాణ మార్గాలు

భక్తుల భద్రతే పరమావధిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. యాత్రా మార్గాలు, బేస్ క్యాంపుల వద్ద జవాన్లతో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కీలక ప్రాంతాల్లో అధునాతన నిఘా వ్యవస్థలు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు సహాయక శిబిరాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి యాత్రికులకు ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పహల్గావ్ మీదుగా సాగే మొదటి మార్గం పొడవైనది. అయినప్పటికీ.. కొండ వాలు తక్కువగా ఉండి ప్రయాణం కొంత సులభంగా ఉంటుంది. రెండోదైన బాల్తల్ మార్గం తక్కువ దూరంతో కూడుకున్నది. ఇది నిటారుగా ఉంటుంది. ఈ రూట్ లో ప్రయాణం సవాల్ తో కూడుకున్నది. భక్తులు తమ వీలును బట్టి ఈ రెండు మార్గాలలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

తప్పనిసరి రిజిస్ట్రేషన్.. ఈ నియమాలు గుర్తుంచుకోండి

ఈ పవిత్ర యాత్రలో పాల్గొనదలచిన ప్రతి ఒక్క భక్తుడికి అధికారిక రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. గుహాలయం అధిక ఎత్తులో ఉండటం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. ప్రతి యాత్రికుడు తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వ డాక్టర్ల నుంచి పొందిన ఫిట్‌నెస్ ధృవీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. అనుమతి లేని యాత్రికులను బేస్ క్యాంపుల దాటి వెళ్లేందుకు నిరాకరిస్తారు.

యాత్రికులు వెంట తీసుకువెళ్లవలసిన వస్తువుల గురించి కూడా యంత్రాంగం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యంత చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున తగినన్ని థర్మల్ దుస్తులు, రెయిన్ కోట్లు, బూట్లను వెంట ఉంచుకోవాలి. యాత్ర సమయంలో ఎల్లప్పుడూ తగినంత నీరు తాగుతూ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. రోజువారీ వాతావరణ నివేదికలను అనుసరిస్తూ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+